జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దంరాజ్ పల్లి గ్రామంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. గత కొద్దిరోజులుగా గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను మెట్ పల్లికి తరలిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వికాస్ అనే యువకుడు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ట్రాలీ దిగబడింది. దాన్ని ఓవర్ స్పీడ్ గా తీయడంతో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.