అడిషనల్ కలెక్టర్​ను అడ్డుకున్నరు

కాళేశ్వరం లింక్​2 బాధిత రైతుల ఆందోళన

పరిహారం తేలేదాకా సభలకు వచ్చేది లేదు

పబ్లిక్ హియరింగ్ సభ బాయ్‌కాట్

పెగడపల్లి, వెలుగు: కాలేశ్వరం లింక్ 2లో భూమి కోల్పోతున్న వారికి ఉపాధి, పునరావాస కల్పనకు ఏర్పాటు చేసిన పబ్లిక్ హియరింగ్ సభను రైతులు బైకాట్ చేసి నిరసన తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బేతి రాజేశం, ఆర్డీవో మాధురి అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేయగా.. భూమి కోల్పోనున్న 66 మంది రైతులు అటెండ్ కాలేదు. స్థానిక రామాలయం ఎదుట నిరసన  తెలిపారు. పబ్లిక్ హియరింగ్ సభ ముగించుకొని వెనుదిరిగిన అడిషనల్ కలెక్టర్ రాజేశంను బాధిత రైతులు అడ్డుకొని గోడు వెల్లబోసుకున్నారు.  లింక్ 2 పైపుల కింద గ్రామంలో 50 ఎకరాలు, ఓపెన్ కెనాల్ కింద 140 ఎకరాల పంట భూముల్ని కోల్పోతున్నామని, వారంతా చిన్న, సన్నాకారు రైతులేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎస్సారెస్పీ కెనాల్ కోసం గ్రామంలో 300 ఎకరాల భూమి కోల్పోయామని గుర్తుచేశారు.  మూడు పంటలు సాగయ్యే భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.30 లక్షల నష్టపరిహారంతో పాటు పూర్తిగా భూమి కోల్పోయిన ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. రైతుల భూములలో పైప్ లైన్,  బావులు, చెట్లను అంచనావేసి నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్​ను వేడుకున్నారు. గ్రామం నుంచి పైప్ లైన్ వేసే విధానాన్ని, నామాపూర్ మెయిన్ రోడ్డు నుంచి ఎస్​ఆర్​ఎస్పీ కెనాల్ వరకు పైప్ లైన్ వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఇవి కూడా చదవండి..

పండ్ల మొక్కలు పెంచనీకి పైసలొస్తలేవ్

20 ఏండ్ల నుంచి డైట్ కాలేజీల్లో రిక్రూట్​మెంట్​ బంద్​

మా బతుకులతో ఆడుకుంటున్నరు.. నర్సింగ్​ అభ్యర్థుల ఆందోళన

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

 

 

Latest Updates