మార్కెట్లోకి రేంజ్ రోవర్ వెలార్..మేడిన్​ ఇండియా

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎట్టకేలకు స్థానికంగా రూపొందించిన రేంజ్ రోవర్ వెలార్‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌లోకి లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్‌‌‌‌షోరూంలో రూ.72.47 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సీబీయూ(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్) మోడల్ వేరియంట్ల కంటే ఈ మేడిన్ వెలార్ రూ.25 లక్షలు తక్కువ. సింగిల్ ఆర్‌‌‌‌‌‌‌‌ డైనమిక్–ఎస్‌‌‌‌ ట్రిమ్‌‌‌‌లో ఈ వెలార్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌‌‌‌ ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఈ రెండు ఇంజిన్లు స్టాండర్డ్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌తో రూపొందాయి. 2018లో తొలిసారి ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రస్తుతం స్థానికంగా తయారు చేసిన వెలార్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశామని జేఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సురి తెలిపారు.

 

Latest Updates