రాముడి పరువు తీయకండి.. : కాంగ్రెస్ ఎమ్మెల్యే

జార్ఖండ్: జై శ్రీరామ్ పేరుతో కొందరు బీజేపీ నేతలు రాముడి పరువు తీస్తున్నారని జార్ఖాండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ అన్నారు. దేశంలో ప్రధాన సమస్యలు చాలానే ఉన్నాయని.. నిరుద్యోగం, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, నగరంలో విద్యుత్ కొరత వంటి సమస్యలపై దృష్టి సారించండి’ అని తెలిపారు.

జార్ఖాండ్ బీజేపీ మంత్రి సీపీ సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ మధ్య అసెంబ్లీ బయట ఈ సంభాషణ చోటుచేసుకుంది. ‘ఇర్ఫాన్ జీ… మీరు కూడా జై శ్రీరామ్ అనండి. మీ పూర్వీకులు రామ్‌వాలేలే. బాబర్ వాలేలు కాదు’ అని సింగ్ ఆయనకు సూచించారు. దానికి ఇర్ఫాన్ స్పందిస్తూ .. ‘రాముడి పరువు తీయకండి. దేశంలో సమస్యల గురించి పోరాటం చేయండి అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Latest Updates