విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన బస్సు క్లీనర్ కు జైలు శిక్ష

హైద‌రాబాద్ : విద్యార్థినితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఓ ప్రైవేట్ స్కూల్ బ‌స్సు క్లీన‌ర్‌కు  రెండేళ్ల జైలు శిక్ష‌ను విధించింది కోర్టు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ ఎల్‌బీ న‌గ‌ర్‌లో జరిగింది.  మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌కు చెందిన స‌త్య‌నారాయ‌ణ‌(23) అలియాస్ స‌తీశ్ కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కి వ‌చ్చి కొత్త‌పేట‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు స్కూల్ బ‌స్సుకు క్లీన‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే 8వ త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని బ‌స్సులో స్కూల్‌కు వ‌చ్చేప్పుడు, ఇంటికి వెళ్లేప్పుడూ చాక్లెట్స్ ఇస్తూ ఆమెతో స్నేహం ఏర్ప‌రుచుకున్నాడు.

ఓ రోజు స్కూల్ వ‌దిలిన త‌ర్వాత బాలిక‌ను స్కూల్ సెల్లార్‌లోకి తీసుకెళ్లి ఆమెతో అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాడు. ఎవ‌రికైనా చెబితే బాగుండ‌ద‌ని బెదిరింపుల‌కు గురిచేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో చెప్పి బోరున ఏడ్చింది. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేర‌కు చైత‌న్య‌పురి పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దోషిగా తేలిన స‌తీశ్‌కు న్యాయ‌స్థానం రెండేళ్ల జైలు, రూ. 1500 జ‌రిమానా విధిస్తూ బుధవారం తీర్పును వెలువ‌రించింది.

Latest Updates