తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకపాత్ర జైపాల్ రెడ్డిదే

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 79వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకపాత్ర కేంద్ర మాజీ మంత్రి, అపార అనుభవం ఉన్న జైపాల్ రెడ్డిదే కీలకపాత్ర అని మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సంజీవయ్య పార్కు వద్ద ఉన్న జైపాల్ రెడ్డి స్మారక కేంద్రంలో శనివారం  జైపాల్ రెడ్డి 79వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి గొప్ప మేధావి.. మంచి రాజకీయ నేత ఆయనతో తన అనుబంధాన్ని, జ్ఘాపకాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలవంచని ధీశాలి అని కొనియాడారు. పెట్రోలియం శాఖ లో ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు ఎదురైనా అన్నింటిని సమర్థవంతంగా అధిగమించారని గుర్తు చసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జైపాల్ రెడ్డి ఆదేశాలు, సూచనలు తీసుకుని పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టడం జరిగిందని, పార్లమెంటులో బిల్లును పాస్ కావడానికి   కీలకమైన పాత్ర పోషించాడని గుర్తు చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డికి సరైన గౌరవ మర్యాదలు దక్కలేదని వివేక్ వెంకటస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో గొప్ప పాత్ర పోషించిన జైపాల్ రెడ్డిని గొప్ప నేతగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి..

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

Latest Updates