అమ్మాయితో టిక్‌టాక్ చేశాడని.. నగ్నంగా నడిపించి వీడియో తీశారు

అమ్మాయితో కలిసి టిక్‌టాక్ వీడియో చేశాడని ఓ టీనేజర్‌పై ఆ బాలిక తల్లిదండ్రులు దాడి చేసి, నగ్నంగా నడిపించారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ బస్తీలో ఈ ఘటన జరిగింది. ఇటీవలే ఓ టీనేజర్ తన స్నేహితురాలైన 14 ఏళ్ల అమ్మాయితో టిక్ టాక్ వీడియో చేశాడు. అది వైరల్ కావడంతో ఆ బాలిక అన్న చూశాడు. ఆ వీడియోలో వారిద్దరూ చాలా క్లోజ్‌గా కనిపించడంతో కోపంతో రగిలిపోయాడు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న అనుమానంతో ఆమెను కొట్టాడు. ఆ తర్వాత ఈ విషయం తండ్రికి చెప్పగా వారు శుక్రవారం నాడు ఆ కుర్రాడిని పట్టుకుని దాడి చేశారు. నడిరోడ్డులోకి తీసుకొచ్చి కొట్టి.. బట్టలూడదీశారు. నగ్నంగా రోడ్డుపై నడిపిస్తూ వీడియో తీశారు.

ఆ టీనేజ్ కుర్రాడిపై దాడి చేసి నగ్నంగా నడిపించిన వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. దీంతో ఆ బాలుడి తండ్రి స్థానిక పోలీసులకు ఆ అమ్మాయి కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆ కుర్రాడిపై కేసు పెట్టారు. పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింది ఫిర్యాదు చేశారు. అయితే రెండు వైపుల నుంచి కంప్లైంట్లు రావడంతో ఇరు కుటుంబాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates