భారత్ ను సరిగ్గా ఎదుర్కోండి: పాక్ PM కు మసూద్ వార్నింగ్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పాకిస్తాన్ ప్రభుత్వానికి, మీడియాకు వార్నింగ్ ఇచ్చాడు. భారత్ చెస్తున్న మాటల దాడికి పాకిస్తాన్ ప్రభుత్వం సరైన రిప్లే ఇవ్వడం లేదని అన్నారు. అది తనను నిరాశకు గురిచేసిందని చెప్పారు. ఇందుకు ఒక ఆడియోను రిలీజ్ చేశాడు. మసూద్ మాటలను అతని అనుచరుడు చదివి వినిపించాడు. “భారత్ చేస్తున్న ఎదురు దాడికి పాకిస్తాన్ భయపడుతుంది. అది సిగ్గు చేటు. మోడీ మాటలకు భయపడోద్దు. వారికి ధీటుగా సమాదానం ఇవ్వండి. పాకిస్తాన్ భారత్ కు ఇస్తున్న జవాబులు చాలా పేలవంగా ఉన్నాయి. పాక్ మీడియా కూడా తన వైఖరిని మార్చుకోవాలి” అంటూ ఆడియోను రిలీజ్ చేశాడు మసూద్.

మసూద్ కు భయం పట్టుకుంది…
పుల్వామా దాడి చేసిన ఉగ్రవాదులను 100 గంటల్లోగా భారత ఆర్మీ మట్టుబెట్టడంతో జైషై చీఫ్ మసూద్ కు భయం పట్టుకుందని కశ్మీర్ కు చెందిన అధికారులు అన్నారు. జైషే మహమ్మద్ కు చెందిన 20-25 ఉగ్రవాదులు.. పాకిస్తాన్ కు చెందిన 10-15 మంది ఉగ్రవాదులు కశ్మీర్ లో ఉంటున్నట్టు ఆర్మీకి సమాచారం ఉంది. ఇప్పటికే వారిని పట్టుకోవడానికి ఆర్మీ రంగం సిద్ధం చేస్తుండటంతో.. మసూద్ కు భయం పట్టుకుందని తెలిపారు అధికారులు.

Latest Updates