ఢిల్లీని టార్గెట్ చేసిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు: NIA

పాక్ కేంద్ర స్థానంగా పని చేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశరాజధాని ఢిల్లీని టార్గెట్ గా చేసుకున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) తెలిపింది.  ఢిల్లీలో జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన మండీ హౌస్, దరియా గంజ్, కశ్మీరీ గేట్ తదితర ప్రాంతాల్లో పలు సార్లు రెక్కీ నిర్వహించారని వివరించింది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పుల్వామాలో దాడి చేసి భారత్ లో తీవ్ర భయాందోళనకు గురి చేసింది.  ఆ తర్వాత ఢిల్లీలో దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్లు చేస్తోంది.

మార్చిలో సజ్జద్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేయగా, అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గుర్ని కూడా పట్టుకున్నారు. వారిపై ఎన్ఐఏ అధికారులు సెప్టెంబరులో చార్జిషీటు దాఖలు చేశారు. వారిలో ఒకరైన బిలాల్ అహ్మద్ ఆత్మాహుతి దాడికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

Latest Updates