జైషే ఆయుధాల గోడౌన్ ధ్వంసం: ఫోటోలివిగో..

Jaishe Ammunition dump blown up in IAF air strike

న్యూఢిల్లీ: పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత వాయుసేన. పాకిస్థాన్ కు చెంపపెట్టులా గట్టి దెబ్బ కొట్టింది. ఉగ్రవాదులను పోషిస్తూ వచ్చిన దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పింది. నేరుగా ఆ దేశంలోకి వెళ్లి జైషే ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి మన యుద్ధ విమానాలు. దాదాపు 300 మంది ముష్కరులను మట్టుబెట్టి తిరిగి వచ్చింది వాయుసేన.

పక్కాగా నిఘా పెట్టి.. పాక్ లో కోవర్ట్ ఆపరేషన్ తర్వాత చేసి దాడి అని వాయుసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. బాలకోట్ లో టెర్రర్ గ్రూపులు ఆత్మాహుతి దాడికి శిక్షణ ఇస్తున్న క్యాంపుపై దాడి చేశాయి యుద్ధ విమానాలు. ఎయిర్ స్ట్రెయిక్ జరిగిన ప్రాంత ఫొటోలు ఇన్ టెల్ సంస్థ బయట పెట్టింది.

జైషే క్యాంపు ఆయుధాలు దాచుకున్న గోడౌన్ పై కూడా వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200 ఏకే రైఫిల్స్, భారీ సంఖ్యలో గ్రనేడ్స్, డిటోనేటివ్ బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి.

పాక్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరంలో అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దేశాల జెండాలను పెయింట్ చేసి ఉన్నట్లు ఆ బిల్డింగ్ ఫొటోల ద్వారా తెలుస్తోంది.

Latest Updates