ఇద్దరి కోసం మొత్తం ఫ్లయిట్‌‌నే బుక్ చేసిండ్రు

jakarta-man-books-entire-flight-to-bali-to-protect-himself-from-covid-19

జకార్తా: ప్రపంచవ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభిస్తోంది. కొంతకాలం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్ పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ రూపం మార్చుకున్న మహమ్మారి యూకే స్ట్రెయిన్, ఆఫ్రికా స్ట్రెయిన్ అంటూ మళ్లీ చాలా దేశాలకు పాకుతోంది. దీంతో చాలా దేశాలు లాక్‌‌డౌన్ విధిస్తున్నాయి. వైరస్ నుంచి పారిపోవడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. జాగ్రత్తలు పాటించడం తప్పనిసరిగా మారింది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి చేసిన చర్య గురించి తెలిస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపించక మానదు. ఇండోనేషియాకు చెందిన రిచర్డ్ ముల్జాదీ అనే వ్యక్తి ఆ దేశ రాజధాని జకార్తా నుంచి బాలికి తన భార్యతో కలసి వెళ్లాలనుకున్నాడు. అయితే కరోనా భయంతో ఇతర ప్యాసింజర్లతో కలసి ప్రయాణించొద్దని అనుకున్నాడు. ఈ క్రమంలో ఏకంగా ఓ ఫ్లయిట్‌‌నే బుక్ చేశాడు. ఫ్లయిట్‌‌లో ముల్జాదీతోపాటు ఆయన భార్య మాత్రమే ప్రయాణించారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేశాడు.

Latest Updates