కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల దగ్గర జల దీక్షలు చేస్తాం: ఉత్తమ్‌

రాష్ట్రప్రభుత్వ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము జలదీక్షలు చేపట్టనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న డిమాండ్లతో కాంగ్రెస్ పార్టీ జూన్ 2న కృష్ణా ప్రాజెక్టు, జూన్ 6న గోదావరి ప్రాజెక్టుల దగ్గర జల దీక్షలు చేపడుతుందని తెలిపారు ఉత్తమ్.

కాంగ్రెస్ హయాంలో 85 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులు వదిలేసి ఒక్క కాళేశ్వరంపై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు ఉత్తమ్. లక్షకోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా అని అన్నారు.  గ్రావిటీతో వచ్చే నీటిని వదిలేసి ఎత్తిపోతలపై అంత శ్రద్ధ దేనికంటూ ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Latest Updates