లైంగికంగా వేధిస్తున్నాడని కాంగ్రెస్ నేతను చితక్కొట్టిన మహిళలు

జలౌన్: లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో ఉత్తర్ ప్రదేశ్, జలౌన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ అనూజ్ మిశ్రాను ఇద్దరు మహిళలు కొట్టారు. ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. ‘అనూజ్ మిశ్రా చాన్నాళ్లుగా మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అజయ్ కుమార్ లల్లూ జీకి ఫిర్యాదు చేశాం. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు’ అని మిశ్రాను కొట్టిన వారిలో ఒకరైన మహిళ పేర్కొంది. అయితే దీన్ని తనపై జరిపిన కుట్రగా అనూజ్ మిశ్రా చెప్పడం గమనార్హం. తనపై దాడి చేసిన మహిళల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీ బేరర్ అని, పార్టీ విమెన్ సెల్ పోస్టు నుంచి ఆమెను తొలగించారనే కోపంతోనే అటాక్ చేశారని మిశ్రా తెలిపారు. అనూజ్ మిశ్రాపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామని ఒరాయ్ సర్కిల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ చెప్పారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నామని.. త్వరలోనే మిశ్రాను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ ఘటన విషయంలో నిజానిజాలు తెలుసుకోవడానికి యూపీ కాంగ్రెస్ ఐదుగురు సభ్యుల టీమ్‌‌ను నియమించింది.

Latest Updates