తమిళనాడులో జోరుగా జల్లికట్టు పోటీలు

మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. యువకులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆ రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఇవాళ(బుధవారం)ఉదయం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు.

జల్లికట్టులో ఎద్దులను అదుపుచేయడానికి 730 మంది పోటీపడుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటికే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా ఈ పోటీలను చూసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా నిర్వాహకులు అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Latest Updates