విద్యార్ధుల్ని చితకొట్టిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీ వైరల్ వీడియో

ఢిల్లీ జామియా యూనివర్సిటీలో డిసెంబర్ లో జరిగిన గొడవలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతోంది. వర్సిటీలోని లైబ్రరీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ పై పోలీసులు దాడి చేస్తున్న విజువల్స్ అందులో రికార్డయ్యాయి. ఫైబర్ లాఠీలతో లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు.. విద్యార్థులను తీవ్రంగా కొట్టారు. దీంతో విద్యార్థులంతా అక్కడి నుంచి తలోదిక్కు పరుగులు పెట్టారు. గతేడాది డిసెంబర్ 15న రాత్రి ఈ దాడి జరిగింది.  ఈ వీడియోపై ఎంక్వైరీ చేయిస్తున్నామన్నారు ఢిల్లీ క్రైమ్స్ స్పెషల్ కమిషనర్ ప్రవీర్  రంజన్. జామియా ఘటనలపై ఇప్పటికే విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.

Latest Updates