పాక్ కు గడ్డిపెట్టిన ఇండియన్ ముస్లిం లీడర్..

అంతర్జాతీయ వేదికలపై భారత్ పై పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టారు  ‘జమైత్ ఉలేమా ఎ హింద్’ జనల్ సెక్రెటరీ, మాజీ ఎంపీ మహమ్మద్ మదానీ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ లో ఉన్న ముస్లింలు, భారత్ కు వ్యతిరేకంగా ఉన్నారని పాకిస్తాన్ పలు అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్ లో తాముకూడా భాగమని దేశానికి వ్యతిరేకంగా ముస్లింలు పనిచేయరని అది పాకిస్తాన్ అవివేకమని అన్నారు.

కశ్మీర్ భారత్ లో భాగమని అన్నారు మహమ్మద్ మదాని. ఇందుకుగాను బుధవారం ‘జమైత్ ఉలేమా ఎ హింద్’ తరపున రిజల్యేషన్ పాస్ చేశామని చెప్పారు. భారత దేశంలో శాంతిని భంగపరిచే చర్యలను తాము ఖండిస్తామని అన్నారు. ఇండియా తమ సొంతదేశమని తాము ఇందులో భాగమని తెలిపారు.

Latest Updates