అనంతనాగ్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు- భధ్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోంది. అనంతనాగ్ జిల్లాలోని పజల్ పొరా ప్రాంతంలో ఉదయం కాల్పులు మొదలయ్యాయి. పజల్ పొరాలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో ఆర్మీ, CRPF, జమ్మూకశ్మీర్ పోలీసులు కూంబింగ్ స్టార్ట్ చేశారు. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా… బలగాలు ఎదురుకాల్పులు మొదలుపెట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది.చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడడంతో సైన్యం ఆ ఇంటిని చుట్టు ముట్టింది. అక్కడి స్థానికులను అప్రమత్తం చేసి వేరే ప్రాంతాలకు తరలించింది. పజల్ పొరాలో ఇంటర్నెట్, టెలీకాం సేవలను నిలిపివేశారు.

 

Latest Updates