దాడి చేసింది ఇతనే: స్వర్గంలో ఉంటానన్న ఉగ్రవాది

పుల్వామా: CRPF బస్సు పై అదిల్ అహ్మాద్ అనే కశ్మీర్ కు చెందిన ఉగ్రవాది దాడి చేశాడు. ఇతను జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాది. దాడికి కొన్ని నిమిషాలముందు  అహ్మాద్ మాట్లాడిన ఒక వీడియోను ఉగ్ర సంస్థ విడుదల చేసింది. “మీరందరూ ఈ వీడియోను చూసే సరికి నేను స్వర్గం లో ఉంటాను. నేను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో ఏడాదిగా ట్రేనింగ్ పొందాను. నేను కశ్మీర్ ప్రజలకు ఇచ్చే సందేశం ఒక్కటే.. కాశ్మీర్ ప్రజలందరూ మాతో కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. దక్షిణ కశ్మీర్ భారత్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇప్పుడు నార్త్, సెంట్రల్ కశ్మీర్ కూడా మాతో చేరాలి.. మాలో కొందరిని చంపినంత మాత్రాన మాపై విజయం సాధించినట్టు కాదు”. అని అహ్మద్ మాట్లాడాడు.

ఈ ఘటనలో 40 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. సైనికుల బలిదానం వృదా కాదని ప్రధాని మోడీ అన్నారు. దేశం మొత్తం అమరుల కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.  ప్రతి దాడి తప్పక చేస్తామని తెలిపారు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.  ఇది పిరికి పంద చర్యగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ….. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతతో పాటు పలువురు  రాజకీయనాయకులు ఈ దాడిని ఖండించారు.

Latest Updates