కేంద్రం జమ్ము కశ్మీర్‌ను అమ్మకానికి పెట్టింది : ఒమర్‌ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులు భూములు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి చట్టంలోని సెక్షన్‌ 17 నుండి రాష్ట్ర శాశ్వత నివాసి అని తెలిపే పదాన్ని తొలగిస్తున్నట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ తెలిపింది. జమ్ము కశ్మీర్‌ ప్రస్తుతం అమ్మకానికి పెట్టబడిందని, దీంతో పేద, చిన్న భూ యజమానులకు నష్టం కలుగుతోందంటూ ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.

వ్యవసాయ భూములను వ్యవసాయేతరులకు బదిలీ చేసేందుకు అనుమతించేలా ఈ సవరణల్లో మార్పులు చేయలేదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా తెలిపారు. అయితే విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణా కేంద్రాల ఏర్పాటుకు మాత్రం మినహాయింపు కల్పించినట్లు తెలిపారు.

అయితే ఈ సవరణలు ఆమోద యోగ్యం కాదన్నారు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా. జమ్ముకశ్మీర్‌లోని భూ యాజమాన్య చట్టాలకు ఆమోదయోగ్యం కాని సరవణలన్నారు. వ్యవసాయేతర భూమిని కొనుగోలు చేసే సమయంలో నివాసయోగ్యతా డాక్యుమెంట్లు కూడా అవసరంలేదని కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. దీంతో ఈ సవరణలు వ్యవసాయేతర భూములను ఇతరులకు బదిలీ చేయడాన్ని ఈజీ చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates