జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లో ఇవాళ మరో ఎన్ కౌంటర్ జరిగింది. బుద్గాం జిల్లాలోని గోపాల్ పుర ఏరియాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. గోపాల్ పురలో ఆర్మీ కూంబింగ్ చేస్తుండగా.. టెర్రరిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఫైరింగ్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. మిగితా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి.

Latest Updates