జమ్మూలో ఎన్ కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్ లో ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉద్రవాదులను హతమార్చాయి.  ట్రాల్స్ సెక్టార్ లోని పింగ్లీష్ గ్రామంలో ఉగ్రవాదులు  తలదాచుకున్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి  బలగాలు. ఇంట్లో నక్కిన ముగ్గురిని టార్గెట్ చేశాయి. నిన్న సాయంత్రం నుంచి ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో రెండు ఏకే -47 రైఫిల్స్, ఒక పిస్టోలు లభ్యమైంది. మృతుల్లో పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలకంగా ఉన్న జైషే మహ్మద్ కమాండర్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారనే సమచారంతో వేట కొనసాగిస్తున్నాయి భారత బలగాలు.

Latest Updates