జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్: ఇద్దరు టెర్రరిస్టులు హతం  

జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. పుల్వామాలోని డాలిపోరా ఏరియాల్లో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో జవాన్లను చూసిన ఉగ్రవాదులు.. కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఓ జవాను కూడా చనిపోయాడు.  ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టి కాల్పులకు దిగాయి భద్రతా బలగాలు. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు తప్పించుకుపోయినట్లు తెలుస్తోంది. వీరి కోసం కూంబింగ్ చేస్తున్నారు. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు.