కామన్ సెన్స్ లేని వారి వల్లే ఎయిర్ స్ట్రైక్: ముఫ్తీ

Jammu kashmir ex cm mehabooba mufti on IAF air strikes

Jammu kashmir ex cm mehabooba mufti on IAF air strikesశ్రీనగర్: పాకిస్థాన్ లోని జైషే క్యాంపులపై మంగళవారం తెల్లవారు జామున భారత వాయు సేన చేసిన ఎయిర్ స్ట్రైక్ ను జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తప్పుబట్టారు. కామన్ సెన్స్ ను వాడడం మానేసిన కొంత మంది ట్విట్టర్, న్యూస్ చానెళ్లలో వార్ కావాలంటూ హిస్టీరియా (మానసిక రోగం)తో ఊగిపోయారని ఆమె అన్నారు. ఇలాంటి వారి వల్లే ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ జరిగిందని, చదువుకున్న వాళ్లు కూడా ఇలా యుద్ధం కోసం తాపత్రయపడ్డారని అన్నారు. వాస్తవానికి ఇది నిజమైన అజ్ఞానమని ముఫ్తీ చెప్పారు.

ఏది నిజం?

ఐఏఎఫ్ చేసిన దాడిపై పాక్ ఒకలా భారత్ మరోలా చెబుతున్నాయని, ఏది నిజమోనంటూ మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. ఎవరూ చనిపోలేదని పాక్.. 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని భారత్ చెబుతున్నాయి. అయితే రెండూ నిజమే కావచ్చేమోనని ఆమె కామెంట్ చేశారు.

కశ్మీరీలకు ఇంకా ఎన్నాళ్లీ బాధలు

పాక్ ఎవరూ చనిపోలేదని చెబుతున్నప్పటికీ.. భారత్ నియంత్రణ రేఖను ఉల్లంఘించిందని అనడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరింతగా ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే మళ్లీ కశ్మీరీల ప్రాణాలకే ప్రమాదమని మెహబూబా అన్నారు. ఇంకా ఎన్నాళ్లు ఇలా కశ్మీరీలు బాధలు పడాలని ప్రశ్నించారు. కొంత మంది ఇగోల కోసం, దేశ భక్తి ప్రదర్శనల కోసం యుద్ధం చేయాలనడం సరికాదని చెప్పారు.

Latest Updates