కశ్మీర్‌లో డేరింగ్ ఆపరేషన్.. ఇద్దరిని కాపాడిన వాయుసేన

భారీ వర్షాలు జమ్మూ కశ్మీర్ ను ముంచెత్తుతున్నాయి.. వరుసగా కురుస్తున్న వర్షాలుతో తావి నదికి వరద పోటెత్తింది. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో ఇద్దరు వ్యక్తులు వరదలో చిక్కుకు పోయారు.  దీంతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. రెస్క్యూ చేసి వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. అయితే కిందికి దిగేందుకు ఇండియన్ ఆర్మీ ప్రయత్నించటంతో ముందుగా తాడు తెగి… హెలికాప్టర్ నుంచి నీటిలో పడిపోయాడు జవాన్. దీంతో ముందుగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న జనాన్ని రక్షించారు. ఆ తర్వాత మిగితా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తోంది.

Latest Updates