రేపటికల్లా స్వేచ్ఛ గ్యారెంటీ: కశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ

శ్రీనగర్: కశ్మీర్​లోయ ప్రశాంతంగానే ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 5 న విధించిన నిషేదాజ్ఞలను దశల వారీగా ఎత్తేస్తున్నట్లు పేర్కొంది. జమ్మూలో ఆంక్షలను దాదాపు పూర్తిగా ఎత్తేశామని, శ్రీనగర్​లో అక్కడక్కడా అమలులో ఉన్న ఆంక్షలనూ పంద్రాగస్టు నాటికి సడలించే అవకాశం ఉందని ప్రిన్సిపల్​ సెక్రెటరీ రోహిత్​కన్సాల్​చెప్పారు. ఈద్​రోజు అక్కడక్కడా జరిగిన ఆందోళనలు మినహా మంగళవారం పరిస్థితి నార్మల్​గానే ఉందన్నారు. పంద్రాగస్టు వేడుకలకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, స్టూడెంట్లు, వివిధ జిల్లాల్లో పోలీసులు డ్రెస్​రిహార్సల్స్ కూడా చేస్తున్నారని చెప్పారు. కొత్త యూనియన్‌‌ టెరిటరీలో ఇండిపెండెన్స్‌‌ డే వేడుకలను ఘనంగా జరుపుతామన్నారు.

కాశ్మీర్​లో ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వీలైనంత వరకు సాయం చేస్తున్నట్లు రోహిత్​చెప్పారు. మొబైల్ సర్వీసులను బ్యాన్​చేయడంతో పలు ప్రాంతాల్లో 300 పబ్లిక్​ఫోన్​పాయింట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో ప్రజలు 24 గంటల్లోనే 5 వేల కాల్స్​చేసుకున్నారని వివరించారు. మెడికల్​సర్వీసులకు ఎలాంటి ఆటంకంలేదన్నారు. ఓపీ, ఇన్​పేషెంట్లు, ఆపరేషన్లు యథావిధిగా జరిగిపోతున్నాయని వివరించారు. ఎమర్జెన్సీ మందులు స్టాక్​ఉన్నాయని తెలిపారు. ట్విట్టర్, ఫేస్​బుక్​వంటి సోషల్​మీడియా ఫ్లాట్​ఫాంలపై ఫేక్​న్యూస్​ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్​సెక్రెటరీ రోహిత్ హెచ్చరించారు. నిందితులను కోర్టు ముందు నిలబెడతామని వార్నింగ్​ఇచ్చారు.

Latest Updates