4 నుంచి మ‌హిళ‌ల‌కు జ‌న్ ధ‌న్ రూ.500

లాక్ డౌన్ క్ర‌మంలో మ‌హిళ‌ల జ‌న్ ధ‌న్ అకౌంట్లో కేంద్రం రూ. 500 ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నెల‌లోనూ వీరికి సాయం అంద‌నుంది. మ‌హిళ‌ల జ‌న్ ధ‌న్ అకౌంట్ల‌లో మే నెల‌కు సంబంధించిన రూ.500 సాయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ చేయ‌డం ప్రారంభించింది. రేపటి నుంచి డ‌బ్బుల‌ను తీసుకోవ‌చ్చ‌ని సూచించింది.

ఈ నెల 4వ తేదీ నుంచి 11 వ‌ర‌కు అకౌంట్ నెంబ‌ర్ల‌లోని చివరి సంఖ్య‌ల ఆధారంగా చెప్పిన రోజుల్లో బ్యాంకుకు వెళ్లి, లేదా ఏటీఎం, ఆన్ లైన్ లో తీసుకోవ‌చ్చు. 11వ తేదీ త‌ర్వాత జ‌న్ ధ‌న్ మ‌హిళ‌ల‌ అంద‌రి అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ కానున్నాయి. జ‌మ అయిన‌ డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌ని, నిధానంగా తీసుకుంటే బెట‌ర‌ని సూచిస్తున్నాయి ఆయా బ్యాంకులు. సోష‌ల్ డిస్టెన్స్ తప్ప‌కుండా పాటించాల‌ని చెబుతున్నారు.

Latest Updates