నా రాజకీయ ఎదుగుదలకు నాయిని కృషి మరువలేనిది

తన రాజకీయ ఎదుగుదలకు నాయిని నరసింహారెడ్డి కృషి మరవలేనిదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన జానారెడ్డి.. నాయినితో తనకు  చాలా సన్నిహితం ఉందన్నారు. తమ జిల్లా వాసి నాయిని ఇకలేరని జీర్ణించుకోలేక పోతున్నానన్నారు. సోషలిస్టు పార్టీలో నాయిని క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. సోషలిస్టు పార్టీలో నాయిని ఉన్న సమయంలో తాను  రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 1978 జనతా పార్టీలో కూడా నాయిని తో కలిసి పనిచేశానన్నారు జానారెడ్డి. ప్రజా సమస్యలపై నాయిని నిరంతరం కృషి చేసే వాడన్నారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వాడి పొగరు ఎగిరే జెండా.. నా తమ్ముడు గోండు బెబ్బులి

Latest Updates