మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంతే.. మళ్ళీ ఒక్కటయ్యాం

2024 లో బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014 తర్వాత బీజేపీకి తమకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. దీనిపై ఇటీవల ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసి మాట్లాడానన్నారు. విజయవాడలో బీజేపీ జనసేన నేతల భేటీ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామన్నారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ను పరిష్కరించుకుంటామన్నారు. ఏపీలోనే కాకుండా అవసరమున్న ప్రతిచోటా కలిసి పనిచేస్తామన్నారు. రెండు పార్టీల  మధ్య  సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అంతపెద్ద రాజధాని ఇంత తక్కువ సమయంలో సాధ్యం కాదని ఆనాడే చెప్పానన్నారు పవన్.

ఇదో చారిత్రక రోజని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. 2024లో అధికారమే లక్ష్యంగా ఇరుపార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. జనసేన తప్ప మిగతా పార్టీల నేతలెవరికీ బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. బీజేపీతో బేషరతుగా కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన  పవన్ కు ధన్యవాదాలన్నారు కన్నా లక్ష్మీనారాయణ.  రాష్ట్రంలో తాజా పరిణామాలు, వైసీపీ అరాచకాలు, టీడీపీ అవినీతి పైనా చర్చించామన్నారు.

Latest Updates