పంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి

ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంతాలు పట్టింపులు వదిలి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలలను  తప్పకుండా పాటించాలన్నారు. కేంద్రం చెప్పిన విధంగా తక్షణమే అన్ని విద్యాసంస్థలను మూసివేయాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ,బస్టాండులు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు వైద్య బృందాలను నియమించాలన్నారు.  రాజకీయ పార్టీలు ,స్వచ్ఛంద సంస్థలు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జనసేన శ్రేణులకు ఇప్పటికే ప్రణాళిక ఇచ్చామన్నారు. ప్రజలకు  ఈ వైరస్, దాని విస్తృతపై ప్రాథమిక అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనసైనికులకు తెలియజేశామన్నారు.

Latest Updates