నామినేషన్ వేసిన పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విశాఖ నగర పాలక సంస్థ జోన్ 5 లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావంలో భాగంగా గాజువాక, భీమునిపట్నం, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో జరగబోయే మూడు  ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. భీమవరం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ శుక్రవారం నామినేషన్ వేయనున్నారు.

Latest Updates