సౌభాగ్య రాయల సీమకు 50 వేల కోట్లు : పవన్

ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  రోజు రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తూ.. బహిరంగ సభలు, రోడ్ షోలతో ముందుకెళ్తున్నారు. గురువారం నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ హామీల వర్షం కురిపించారు. ‘జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అలాగే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్స్‌ పంపిణీ. ప్రతీ నియోజకవర్గంలో పాలిటెక్నిక్‌, డిగ్రీ కాలేజీ. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు నుంచి పది ఉచిత గ్యాస్‌ సిలిండర్లు. కేసీ కెనాల్‌ ద్వారా రెండు పంటలకు నీళ్లందిస్తాం. అలాగే 60 ఏళ్లు నిండిన రైతులకు రూ.5 వేలు పెన్షన్, ఎకరానికి రూ.8 వేలు సాగు సహాయం అందిస్తాం. సౌభాగ్య రాయలసీమ కింద రూ. 50 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తాం. కళాకారుల కోసం రాయలసీమ కల్చరల్‌ అకాడమీ ఏర్పాటు చేస్తాం ‘ అని పవన్ హామీ ఇచ్చారు.

Latest Updates