టీడీపీ కోటలు బద్దలు కొడతాం

Janasena leader Pawan campaigning in Gunturu

గుంటూరు ఎన్నికల ప్రచారంలో పవన్‌

‌‌‌అమరావతి, వెలుగు: ‘జన సైనికులకు ఆడపడుచులు వీర తిలకం దిద్దిపంపండి. మీరిచ్చే ధైర్యం తో అమరావతిలో టీడీపీకోటలు బద్దలు కొడతాం ’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌‌‌‌ కల్యాణ్‌ అన్నారు. ఒకరికి ఊడిగం చేసే రోజులు పోయాయని, పల్లకీలు మోసిన ప్రజలనే పల్లకీలు ఎక్కిస్తానని చెప్పారు. ఇక్కడున్నది రూపాయి వాసన చూపిస్తే మోసపోయే తరం కాదన్నారు.‘రాజకీయం అంటే లోకేష్ భవిష్యత్తో, జగన్‌‌‌‌​ భ విష్యత్తో కాదు. మన,మన పిల్లల భవిష్యత్తు. దాన్ని సక్రమంగా తీర్చిదిద్దడానికే వచ్చా’నని చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లాలో పవన్‌‌‌‌ ఎన్నికల ప్రచారం చేశారు.రోడ్‌ షోలు నిర్వహించారు. ‘జనసేన చుట్టూ ఉండేది యువతేనని, వాళ్లేం రాజకీయాలు చేస్తారని హేళన చేస్తున్నారు. నేను యువతరం కోసం రాజకీయాల్లోకి వచ్చా . అవినీతితో భ్రష్టుపట్టిన రాజకీయాల్ని మారుస్తా’నన్నారు. టీడీపీకి వాళ్ల ఎమ్మెల్యే లను అదుపు చేసే శక్తి లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ భాజపాను తిట్టడం, ఢిల్లీ వెళ్లి వారి కాళ్లు పట్టుకోవడం వైఎస్సార్‌ సీపీ నైజమని, అది తనకు రాదని వ్యాఖ్యానించారు. వైసీపీకి ముస్లింల ఓట్లు కావాలి గానీ వారికి పదవులివ్వరని ధ్వజమెత్తారు. గల్లా ను సాగనంపండి‘ అమరావతికి గుంటూరు కూతవేటు దూరంలోఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. సింగపూర్ తరహాలో గుంటూరును అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు మురికి కూపంలో వదిలేశారు’ అని పవన్‌‌‌‌ విమర్శించారు. హోదా కోసం గల్లా జయదేవ్‌ ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ’ అని పార్లమెంటు సమావేశాల ఆఖరులో గొంతెత్తకపోతే.. ముందేమాట్లాడి ఉండొచ్చు కదా అని నిలదీశారు. జిల్లాలో అతిసారంతో ప్రజల ప్రాణాలు పోయినా ఆయన పట్టించుకోలేదన్నారు. బీజేపీ చేసిన మోసం చివరివరకూ టీడీపీకి గుర్తుకు రాలేదా అని ప్రశ్నిం చారు.‘టీడీపీ అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే పార్టీ.గుం టూరులో టీడీపీ కోటలు బద్దలు కొట్టి గల్లాను సాగనంపండి’ అని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి రూ.8 వేల పెట్టుబడిజనసేన అధికారంలోకి వచ్చాక దళితుల్లో వెనుక బడిన రెల్లి కుల ఆడ పడుచులకు రూ.50 వేలు రుణాలిస్తామని పవన్‌‌‌‌ హామీ ఇచ్చారు. ‘మురికి వాడల్లోని ముస్లింలకు రూ.100 కోట్లతో బహుళ అంతస్తుల గృహ సముదాయాలు నిర్మిస్తాం . పేద, ధనిక తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ ఏడాదికి 6 నుం చి 10 గ్యాస్‌‌‌‌ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం ’ అన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రైతులకు పెన్షన్‌‌‌‌ ఇచ్చే దస్త్రంపైనే తొలిసంతకం పెడతానని చెప్పారు. ‘60  ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ రూ.5 వేలు పెన్షన్‌‌‌‌ ఇస్తాం. వ్యవసాయ పెట్టుబడులకు ఎకరాకు రూ.8 వేలిస్తాం ’ అని హామీ ఇచ్చారు. 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

Latest Updates