జగన్ కు పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పార్టీ అధినేత పవన్ పై విమర్శలు చేసిన రాపాక సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేేశారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం మోరీ గ్రామంలో చేేనేత వేడుకల్లో పాల్గొన్న రాపాక జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గతంలో కూడా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి చర్చల్లో నిలిచారు రాపాక. కొన్ని రోజులుగా జనసేనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ తన వ్యవహార శైలి మార్చుకోవాలన్నారు. ఇంగ్లీష్ భాష అమలుపై  జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపారు.

 

Latest Updates