జనసేన గాజు గ్లాస్​ గుర్తు తొలగింపు

జనసేన గాజు గ్లాస్​ గుర్తు తొలగింపు

స్థానిక ఎన్నికల్లో జనసేన కామన్ గుర్తు గాజు గ్లాసును రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. కామన్ సింబల్ ఇచ్చాక ఆ పార్టీ వరుస ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లలో పోటీ చేయకపోతే ఆ గుర్తును తొలగిస్తారు. జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతకుముందు ఎన్నికల్లోనూ 10 శాతం సీట్లలో అభ్యర్థులను నిలపలేదు. దీంతో గ్లాసు గుర్తును తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గుర్తును కొనసాగించాలని జనసేన కోరగా.. ఎస్ఈసీ తిరస్కరించింది.