సమాజానికి ధైర్యం చెప్పాలనే జనసేన పార్టీ: పవన్

సమాజానికి ధైర్యం చెప్పాలనే పార్టీ పెట్టానని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ . తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్‌ పాల్గొని మాట్లాడారు. ఏ పనైనా సంపూర్ణంగా చేస్తామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సమాజంలోని పిరికివాళ్లు తనకు అవసరం లేదన్నారు. ఎన్నికల కోసం తాను ఆలోచించనని, రాబోయే తరాల కోసం ఆలోచిస్తానన్నారు. ధైర్యం లేనివాళ్లు జనసేన పార్టీలో అవసరం లేదన్నారు.

అంతేకాదు… నాలోని పిరికితనంపై చిన్నప్పటి నుంచే అనుక్షణం నాలో నేనే ఎంతో పోరాడానని తెలిపారు. జిమ్‌కు వెళ్తే కండలొస్తాయి… కానీ మనల్ని భయపెట్టే పరిస్థితులను ఎదుర్కోకపోతే ధైర్యమనే కండ పెరగదన్నారు. వాటిని అధిగమించి ముందుకెళ్లానని చెప్పారు. సమాజంలో నేను పిరికివాడిలా బతకదలచుకోలేదన్నారు. పిరికితనమంటే తనకు చాలా చిరాకన్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఘటనలన్నీ చూసే పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న పవన్ కల్యాణ్… దాడులు చేస్తారేమోనని భయపడితే అలాగే ఉండిపోతామన్నారు.

Latest Updates