బడ్జెట్.. వ్యవసాయ రంగానికి కొండంత అండ

కేంద్ర బడ్జెట్ ను సమర్థించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్న సరికొత్త భారతావనికి బలమైన పునాదులు ఈ బడ్జెట్ వేసిందన్నారు.వ్యవసాయ రంగానికి కొండంత అండనిచ్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఆర్థిక మాంద్యం నెలకొన్న సమయంలో ఈ బడ్జెట్ బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేలా ఉందన్నారు. ఆదాయపన్నుఏడు శ్లాబ్ ల విధానం సంబంధిత వర్గాలకు ఊరటనిస్తుందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో వైసీపీ విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడంపై దృష్టి పెట్టాలన్నారు.

 

 

Latest Updates