జనతా కర్ఫ్యూలో జనం..నిర్మానుష్యంగా రోడ్లు

తెలంగాణలో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది.  ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం ..24 గంటలు అన్నీ బంద్ కావడంతో  నగరం నిశబ్ధంగా కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు, వ్యాపార సంస్థలు, షాప్ లు, మాల్స్ ఇలా అన్నీ మూతపడ్డాయి. జనం లేక  రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  కోవిడ్ 19 నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు జనతా కర్ఫ్యులో భాగస్వాములయ్యారు. శేరిలింగంపల్లి పరిధిలోని మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి ప్రాంతాలలోని ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూనీ పాటిస్తున్నారు.

నిత్యం ఐటీ ఉద్యోగస్థులతో మాదాపూర్ , గచ్చిబౌలి రహదారులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి.  వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు. ప్రజలు ఎవరు బయటికి రావడం లేదు. చౌరస్తాల వద్ద పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు… అత్యవసరానికి బయటకు వెళ్లే  వ్యక్తులు తప్ప మిగతా వ్యక్తులు ఎవరు రోడ్డుపైకి రావడం లేదు.

Latest Updates