కరోనా ఎఫెక్ట్.. ఓలా, ఊబర్ సర్వీస్ బంద్

న్యూఢిల్లీ: క్యాబ్ షేరింగ్ కంపెనీలు ఓలా, ఉబర్‌‌‌‌‌‌‌‌లు తమ పూల్ రైడ్ సర్వీసులను దేశవ్యాప్తంగా క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. కరోనా వైరస్ భయాలు పెరుగుతుండటంతో ఓలా, ఉబర్‌‌‌‌‌‌‌‌లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తెలియని వారితో ప్రజలు రైడ్స్ షేరు చేసుకోవడానికి భయపడుతుండటంతో.. పూలింగ్‌‌‌‌ సర్వీసులు బాగా పడిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు తాము కూడా సాయం చేయనున్నామని‌‌‌‌ రైడ్స్ షేరింగ్ కంపెనీలు చెప్పాయి. ‘కరోనాను దృష్టిలో ఉంచుకుని, ఉబర్ పూల్ సర్వీసెస్‌‌‌‌ను సస్పెండ్ చేశాం. గవర్న్‌‌‌‌మెంట్ అడ్వయిజరీ మేరకు, ప్రజలు సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అవసరం లేని ప్రయాణాలను ఎంకరేజ్ చేయడం లేదు’ అని ఉబర్ అధికార ప్రతినిధి చెప్పారు. గత కొన్ని రోజుల్లో మెట్రోల్లో తమ వ్యాపారాలు బాగా పడిపోయాయని తెలిపారు. ఓలా కూడా తన పూల్ రైడ్ ఆప్షన్ ‘ఓలా షేర్‌‌‌‌’ను తాత్కాలికంగా రద్దు చేసింది. మరోవైపు కరోనా భయానికి ప్రజలు ప్రయాణాలు తగ్గించడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో ఓలా, ఉబర్‌‌‌‌‌‌‌‌ సర్వీసులకు డిమాండ్ తగ్గింది.

కరోనా కవరేజ్…

ఓలా డ్రైవర్ పార్టనర్లకు రూ.30 వేలు

కరోనా వైరస్ బారిన పడిన డ్రైవర్ పార్టనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఓలా రూ.30 వేల వరకు కవరేజ్ ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఓలా డ్రైవర్ పార్టనర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత నుంచి రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఈ పరిహారాలు అందించనున్నామని పేర్కొంది. డ్రైవర్లు లేదా వారి జీవిత భాగస్వాములు మెడికల్ డాక్యుమెంట్లను సమర్పించి ఈ క్లయిమ్స్‌‌ను పొందవచ్చు. ఈ కవరేజ్ వెనువెంటనే అందుతుందని, ఓలా బైక్, ఓలా ఆటో, ఓలా రెంటల్స్, అవుట్‌‌స్టేషన్ డ్రైవర్ పార్టనర్లందరకూ ఈ కవరేజ్ ఇస్తామని తెలిపింది. అలాగే ఓలా లీడింగ్ ఆన్‌‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ యాప్ ఎంఫైన్‌‌తో పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకుంది. దీని ద్వారా డ్రైవర్ పార్టనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మెడికల్ సాయం అందిస్తోంది. డ్రైవర్ పార్టనర్లు ఎంఫైన్ ప్లాట్‌‌ఫామ్ ద్వారా ముగ్గురు డాక్టర్లను ఉచితంగా కన్సల్టేట్ అవ్వొచ్చు. 500 మంది పెద్ద డాక్టర్లను ఈ ప్లాట్‌‌ఫామ్‌‌పైకి తెచ్చామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Latest Updates