అలర్ట్.. ఆదివారం జనతా కర్ఫ్యూ.. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలి

కరోనా నియంత్రించేందుకు ఈ నెల 22న జనతా కర్ఫ్యూ  పాటించాలన్నారు ప్రధాని మోడీ. కరోనా  విస్తరిస్తున్న నేపథ్యంలో మాట్లాడిన మోడీ.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూ పాటిద్దామన్నారు. జనతా ఖర్ఫ్యూను అందరూ కలిసి విజయవంతం చేయాలన్నారు. జనతా కర్ఫ్యూ అనుభవం భవిష్యత్ సవాళ్లకు ఉపయోగపడుతుందన్నారు. భారత్ ఎంత తయారీగా ఉందనేది జనతా కర్ఫ్యూతో తెలుస్తుందన్నరు. డాక్టర్లు, నర్సులు, ఎయిర్ లైన్ స్టాప్ సేవలో నిమగ్నమై ఉన్నారని…  వారు తమను తాము లెక్కచేయకుండా పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి ఆదివారం రాత్రి ధన్యవాదాలు చెబుదామన్నారు. 22న  సాయంత్రం 5 గంటలకు ఇంటి గుమ్మం ముందుకు వచ్చిఅందరూ  5 నిముషాలు చప్పట్లు కొట్టి ప్రజా సేవకులకు సెల్యూట్ చేద్దామన్నారు.

మొదటి ప్రపంచం నాటి పరిస్థితులున్నాయన్నారు ప్రధాని మోడీ. కరోనాకు వ్యాక్సిన తయారు కాలేదన్నారు. ప్రపంచం మొత్తం సంక్షిష్ట పరిస్థితిలో ఉందన్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా ఇంత ఇబ్బంది లేదన్నారు. తనను దేశ ప్రజలు ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదన్నారు. అందరు కలిసి లక్ష్యాల వైపు సాగుతున్నామన్నారు. కొన్ని వారాల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనాకు వ్యాక్సిన్ తయారు కాలేదన్నారు.కరోనా ఇతరులకు సంక్రమించకుండా అడ్డుకోవాలన్నారు. సామాజిక దూరం పాటించడం అవసరమన్నారు. సమూహాలకు దూరంగా ఉండాలన్నారు. తప్పనిసరైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు.  కరోనా సంక్షోభం సామాన్య విషయం కాదన్నారు. కరోనాపై పోరాటానికి ప్రజలు సహకరించాలన్నారు.కరోనాను ఎదుర్కొనేందుకు సంకల్పం,సంయమనం కావాలన్నారు. కరోనా కట్టడిలో పౌరుల పాత్రే కీలకమన్నారు.

Latest Updates