కరోనా కేసులున్న జిల్లాల్లో మార్చి 31 వరకు ‘జనతా కర్ఫ్యూ’

దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగబోతోంది. కరోనా కేసులున్న జిల్లాల్లో మార్చి 31 వరకు అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి కరోనా పరిస్థితిపై రివ్యూ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించడానికి కరోనా ప్రభావిత జిల్లాలను మూసేయడం మేలని ఈ సమావేశంలో ఏకాభ్రిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్నిన పిలుపుతో ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రజలు బయటకు రాకుండా సహకరించడంతో దీనిని కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయం ప్రకారం తెలంగాణలోహైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి భద్రాద్రి జిల్లాలు లాక్ డౌన్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే

– మార్చి 31 వరకు దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ల నిలిపివేత. గూడ్స్ రైళ్లకు దీని నుంచి మినహాయింపు.

– అన్ని సిటీల్లో మెట్రో సర్వీసులు బంద్.

– కరోనా ప్రభావిత 75 జిల్లాల్లో కూరగాయలు, పాలు, మెడికల్ లాంటి అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సర్వీసుల నిలిపివేత.

– అంతర్రాష్ట్ర ప్రజా రవాణా సర్వీసులు బంద్.

కరోనా కేసులున్న జిల్లాల్లో మార్చి 31 వరకు‘జనతా కర్ఫ్యూ’

Latest Updates