సౌత్‌ ఎంట్రీకి సిద్ధమవుతోన్న జాన్వీ?

శ్రీదేవి సౌత్‌‌తో పాటు బాలీవుడ్‌‌లోనూ స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా ఎదిగి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడామె కూతురు మొదట నార్త్‌‌లో జెండా పాతి ఆ తర్వాత సౌత్‌‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నిజానికి జాన్వీ కపూర్‌‌‌‌ని తెలుగులో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఆ  విషయంలో రాజమౌళి పేరు ప్రధానంగా వినిపించింది. అయితే దాని గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. జాన్వీ తెలుగులో నటించిందీ లేదు. కానీ ఆమె కోలీవుడ్‌‌ ఎంట్రీ మాత్రం కన్‌‌ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది.

అజిత్‌‌తో బోనీ కపూర్‌‌‌‌ తీయనున్న చిత్రంతో జాన్వీ సౌత్‌‌లో పాదం మోపనుందని బాలీవుడ్‌‌ వర్గాలు చెబుతున్నాయి. అజిత్‌‌ అంటే శ్రీదేవికి ఎంతో ఇష్టం, గౌరవం. అందుకే అతనితో సినిమా తీయమని భర్తని కోరింది. ఆమె లేకపోయినా బోనీ ఆ కోరిక తీర్చారు. ‘నేర్కొండ పార్వై’ని నిర్మించారు. ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కానుంది. అజిత్​ టాలెంట్​, వ్యక్తిత్వం చూసి ఇంప్రెస్​ అయిన బోనీ నెక్స్ట్‌‌ సినిమా కూడా తనతోనే చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాతోనే జాన్వీ దక్షిణాదిన ఎంట్రీ ఇస్తుందట. అయితే అజిత్‌‌ పర్సనాలిటీకి ఆమె సూటవుతుందా, అతనికి జోడీగా కాకుండావేరే ఏదైనా కీలక పాత్రలో కనిపిస్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక వేళ ఈ వార్త నిజమైతే బోనీ ఎలాగూ క్లారిటీ ఇస్తారు కనుక వెయిట్ చేసి చూడటమే బెటర్.

Latest Updates