లిథియం బ్యాటరీలతో ఫస్ట్ సబ్​మెరైన్

స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు విస్తృతంగా వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీలతో జపాన్ తొలిసారిగా ఓ సబ్ మెరైన్ ను నడుపుతోంది. దాదాపు 2002 నుంచే లిథియం అయాన్ సబ్​మెరైన్​ను రంగంలోకి దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆ దేశం.. ఇన్నాళ్లకు ప్రాజెక్టును పూర్తి చేసింది. ‘ఓర్యూ’ అనే సబ్ మెరైన్​ను ఈ నెల 5న సర్వీస్​లోకి ప్రవేశపెట్టింది. ఓర్యూను 2018లోనే ప్రారంభించినా, టెక్నికల్ రీజన్స్ వల్ల సర్వీస్​లోకి తీసుకోవడం మాత్రం ఆలస్యమైంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాసిడ్ బ్యాటరీల సబ్​మెరైన్ ల కన్నా లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే సబ్ మెరైన్​లకు మెయింటెనెన్స్ చాలా తక్కువవుతుందట. బ్యాటరీలు ఎక్కువ కాలం పని చేస్తాయని, సబ్​మెరైన్ వేగం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఓర్యూ సబ్ మెరైన్ నీటిలో మునిగినప్పుడు గరిష్టంగా 20 నాట్ల వేగంతో, నీటిపై తేలుతూ అయితే 13 నాట్ల వేగంతో వెళుతుందట. 276 ఫీట్ల పొడవుండే దీంట్లో 65 మంది ఉండొచ్చట.

Latest Updates