ఆడాళ్లూ కళ్లద్దాలు వద్దు.. బ్యాన్‌‌‌‌ చేసిన జపాన్

జీన్స్​, టీషర్టులు వేసుకురావొద్దు.. చెప్పులొద్దు, షూసే వేసుకోవాలి. ఫార్మల్స్​లో రావాలి.. ఇన్​షర్ట్​ చేసుకోవాలి. ఆడాళ్లయితే చుడీదార్లు లేదంటే ఫార్మల్​ ప్యాంట్​ షర్ట్​ వేసుకోవాలి’ ఇవీ కొన్ని కంపెనీలు, కాలేజీలు పెడుతున్న షరతులు. ఇప్పుడు జపాన్​లోని కొన్ని కంపెనీలు ఓ వింత రూల్​ పెట్టాయి. కళ్లద్దాలు పెట్టుకుని ఆఫీసుకు రావొద్దంటున్నాయి. ఆ రూల్​ కూడా కేవలం ఆడవాళ్లకే. దానికి వాళ్లు చెబుతున్న కారణమేంటో తెలుసా..? ఒక్కో కంపెనీ ఒక్కో కారణం చెబుతోంది. ఉదాహరణకు షాప్​ అసిస్టెంట్లనుకోండి.. వచ్చిపోయే కస్టమర్లకు చెడ్డ ఇంప్రెషన్​ పడిపోతుందట.

బ్యూటీ రంగంలో అయితే.. ఆ ఎంప్లాయీ అందం సరిగ్గా కనిపించకుండా అద్దాలు డామినేట్​ చేస్తాయట. ఎయిర్​లైన్​ ఎంప్లాయీస్​ విషయంలో ‘భద్రత’ అనే సాకు చూపిస్తున్నారు. రెస్టారెంట్ల వాళ్లు ఏం చెబుతున్నారో తెలుసా.. సంప్రదాయ జపాన్​ డ్రెస్సులకు అద్దాలు సూటవ్వవట. ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో కారణం చెప్పి కళ్లద్దాలను బ్యాన్​ చేయడంతో ఆడాళ్లు రగిలిపోతున్నారు. ఇప్పుడు ఆ దేశంలో దీనిపై హాట్​ హాట్​ చర్చే నడుస్తోంది.

పిచ్చి పిచ్చి కారణాలు చూపించి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. ఎప్పటివో పాత కాలపు రూల్స్​ పట్టుకుని ఇప్పుడు తమపై రుద్దాలని చూస్తే ఊరుకోబోమంటున్నారు. ఇది లింగ వివక్షేనని అంటున్నారు. #GlassesAreForbidden హ్యాష్​ట్యాగ్​ పేరిట నెట్టింట వైరల్​ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మధ్యే అదే జపాన్​లో హైహీల్స్​ వేసుకుని జాబ్​కు రావాలన్న రూల్​పై  పెద్ద దుమారమే రేగింది. #KuToo పేరిట పెద్ద ఆన్​లైన్​ ఉద్యమమే నడిచింది.

Latest Updates