జపాన్​ 126వ చక్రవర్తిగా నరుహి పట్టాభిషేకం

కొత్త చక్రవర్తిగా బాధ్యతల స్వీకరణ

టోక్యో: జపాన్​ కొత్త చక్రవర్తిగా నరుహితో మంగళవారం చామంతి సింహాసనాన్ని అధిష్టించారు. రాజభవనం ఇంపీరియల్​ ప్యాలెస్​లో వందలాది ఉన్నతాధికారుల సమక్షంలో, సంప్రదాయబద్ధంగా కిరీట ధారణ జరిగింది. తర్వాత పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించిన నరుహితో.. జపాన్​ చక్రవర్తిగా తన పట్టాభిషేకాన్ని అధికారికంగా ప్రకటించారు. జపనీయుల సంతోషానికి, ప్రపంచ శాంతికి కృషి చేస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. జపాన్​ అధికార ప్రతినిధిగా, జపనీయుల ఐకమత్యానికి పాటుపడుతూ తన విధులను నిర్వర్తిస్తానని ప్రామిస్​ చేశారు. ఈ కార్యక్రమంలో నరుహితో భార్య, మహారాణి మసాకో ఆయన వెన్నంటే ఉన్నారు. ‘మా చక్రవర్తిగా, జపాన్​ రాజ్య ప్రతినిధిగా మిమ్మల్ని గుర్తించి, గౌరవించుకుంటాం’ అంటూ జపాన్​ ప్రజల తరఫున ప్రధాని షింజో అబె కొత్త చక్రవర్తితో చెప్పారు. తర్వాత ‘లాంగ్​లివ్​ ఎంపరర్’ అంటూ మూడుసార్లు నినదించారు.

విశేషాలు..

  • రెండు వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమిది.
  • నరుహితో జపాన్​కు 126వ చక్రవర్తి. 59 ఏళ్ల నరుహితో ఆక్స్​ఫర్డ్​లో చదువుకున్నారు.
  • ఈ కార్యక్రమానికి 26 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాట్లు.
  • అరగంట పాటు సాగిన ఈ కార్యక్రమంలో మన​ ప్రెసిడెంట్​ రామ్​నాథ్​ కోవింద్  పాల్గొన్నారు.
  • 190 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
  • హగిబీస్​ తుఫాన్​ నేపథ్యంలో రాయల్​ పరేడ్​ను వచ్చే నెలకు వాయిదా వేశారు.

Latest Updates