కొండెక్కిన మల్లెపూలు.. కేజీ ఎంతో తెలుసా?

ఆయా సీజన్ కు అనుకూలంగా పండ్లు, పూలకు గిరాకీ ఉంటుంది. గిరాకీ తగ్గట్టుగానే ధర ఉంటుంది. ఒక్కోసారి తక్కువగా ఉంటే…దిగుబడి తగ్గితే రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం మల్లెపూల ధర ఊహించని రీతిలో భారీగా పెరిగింది. వందల్లో కాదు  ఏకంగా వేలల్లో పెరిగింది. కిలో మల్లెపూల ధర ఏకంగా 3వేల రూపాయలకు చేరింది. ఇది కూడా తమిళనాడులోని మధురైలో..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వారం క్రితం కిలో మల్లెపూలకు రూ. 1500 వరకూ ఉన్న ధర ఇప్పుడు రెట్టింపైంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో మల్లెపూలకు డిమాండ్ అధికంగా ఉందంటున్నారు వ్యాపారులు. ఇదే సమయంలో సరఫరా తగ్గడంతో పూల ధరలు భారీగా పెరిగాయంటున్నారు. సాధారణంగా మార్కెట్ కు వచ్చే పూలలో సగం కూడా రావడం లేదంటున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు కిలోల పూలను అమ్మేవారు ప్రస్తుతం రెండు కిలోలను కూడా అమ్మేపరిస్థితి లేదంటున్నారు.

Latest Updates