RR vs SRH: హైదరాబాద్ టార్గెట్–155

దుబాయ్:‌ ఐపీఎల్–13లో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి  154 రన్స్  చేసింది.  బెన్‌ స్టోక్స్‌(30 ), సంజూ శాంసన్‌(36 ) రాణించడంతో రాజస్థాన్‌ ఆమాత్రం స్కోరైనా చేసింది.  ఆఖర్లో  రియాన్‌ పరాగ్‌(20 ) ఫర్వాలేదనిపించాడు. సన్‌ రైజర్స్‌ బౌలర్‌ జేసన్‌  హోల్డర్‌(3/33) రాణించడంతో  తక్కువ స్కోరుకే పరిమితమైంది రాజస్థాన్.  విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Latest Updates