ట్రెయినింగ్‌ స్టార్ట్‌ చేసిన బుమ్రా

న్యూఢిల్లీ: వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌  బుమ్రా.. ట్రెయినింగ్‌ మొదలుపెట్టాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రెయినర్‌ రజనీకాంత్‌ శివజ్ఞానమ్‌ ఈ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షిస్తున్నాడు. జిమ్‌లో తన ట్రెయినింగ్‌కు సంబంధించిన వీడియోను బుమ్రా సోమవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.  సెప్టెంబర్‌లో వెన్ను నొప్పికి గురైన బుమ్రా.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన హోమ్‌ సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో వెస్టిండీస్‌తో సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు. ‘బుమ్రా ఎంసీఏలో ట్రెయినింగ్‌ చేస్తున్నాడు. పర్సనల్‌గా అరెంజ్‌మెంట్స్‌ చేసుకున్నాడు. ఐపీఎల్‌ లేనప్పుడు అవసరమైన ప్లేయర్లకు రజనీకాంత్‌ సేవలందిస్తుంటాడు. దీనితో మా ఫ్రాంచైజీకి ఎలాంటి సంబంధం లేదు. ఇద్దరు పార్టీల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఒప్పందం ఇది’ అని  ఢిల్లీ క్యాపిటల్స్‌ పేర్కొంది. పూర్తి స్థాయిలో కోలుకుంటే బుమ్రా.. వచ్చే ఏడాది జనవరిలో  న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

Latest Updates