తిప్పేసిన బుమ్రా…విహారి తొలి సెంచరీ

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ అదరగొడుతోంది.  మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. ఆరు వికెట్లతో ఫాస్ట్ బౌలర్  బుమ్రా  రెచ్చిపోయాడు. తొమ్మిదో ఓవర్లో బుమ్రా హ్యాట్రిక్ నమోదు చేశాడు. బ్రావో, బ్రూక్స్, చేజ్ లను వరుసగా ఔట్ పెవిలయన్ పంపించాడు.రెండో రోజు ఆట ముగిసే సమయాని వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 33 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో కార్న్ వాల్ 4,హమిల్టన్ ఉన్నారు.

అంతకు ముందు 264/5 తో ఆట మొదలు పెట్టిన ఇండియా 416పరుగులకు ఆలౌట్ అయ్యింది. తెలుగు తేజం హనుమ విహారీ టెస్టుల్లో తొలి సెంచరీ (111) పూర్తి చేసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 55, కెప్టెన్ కొహ్లీ 76 పరుగులతో రాణించారు. ఇక తొలిసారి బౌలర్ ఇషాంత్ శర్మ 57 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడు. ప్రస్తుతానికి భారత్ 329 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 

Latest Updates