కంగనా రనౌత్‌పై… జావేద్ అఖ్తర్ పరువునష్టం కేసు

ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అఖ్తర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ముంబైలోని అంధేరీ కోర్టుకు ఇవాళ(గురువారం) అఖ్తర్ హాజరయ్యారు. తన గుర్తింపు, ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు చూపించారు. వివరాల వెరిఫికేషన్ పూర్తి కావడంతో… తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంశంపై కంగన మాట్లాడుతూ.. జావెద్ అఖ్తర్ పేరును ప్రస్తావించింది. ఆ ఇంటర్వ్యూకు ఆన్ లైన్లో లక్షలాది వ్యూస్ వచ్చాయి. దీంతో.. తన పరువుకు భంగం కలిగించేలా కంగన వ్యాఖ్యానించిందని అఖ్తర్ కోర్టును ఆశ్రయించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేయాలని కోరారు.

Latest Updates