బిడ్డ పుట్టిందని డివోర్స్ అడిగిన జవాన్

ఆందోళనకు దిగిన భార్య

కాశిబుగ్గ, వెలుగు: ఆడపిల్ల పుట్టిందని వరంగల్ శివనగర్‌కు చెందిన ఆర్మీ జవాన్ తన భార్యను విడాకులు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో భార్య ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగింది. భర్త ఇంటిముందే ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మిల్స్​కాలనీ పోలీసులు స్పాట్ కు చేరుకొని.. బాధితురాలిని ఆమె భర్తను స్టేషన్​కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. బాధతురాలు మాట్లాడుతూ.. ఆర్మీ జవాన్ తో తనకు పెండ్లి జరిగి 11 ఏండ్లయిందని, 9 ఏండ్ల కిందట కూతురు పుట్టినప్పటి నుంచి నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కోర్టును ఆశ్రయిస్తే .. ఉత్తర్వులు రాక ముందే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆర్మీలో హవల్దార్​గా పంజాబ్​లో డ్యూటీ చేస్తున్నాడని, ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలియడంతో మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితురాలు ఆఫీసర్లను వేడుకుంది.

For More News..

144 సెక్షన్​లో వివక్ష.. మీడియాకు, ప్రతిపక్షాలకు నో పర్మిషన్

నాలాలపై నిర్మాణాలు కూల్చకుండా స్టే తెచ్చుకుంటున్న జనాలు

వ్యవసాయం నుంచి విమానం​ దాకా.. అన్నీ మార్చేస్తాం

Latest Updates